ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్

వచ్చే ఏడాదికి గిరిజన ప్రాంత పాఠశాలలు అన్నింటికీ సొంత భవనాలు..

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · July 24, 2026 · 1 month క్రితం
  • వచ్చే ఏడాదికి గిరిజన ప్రాంత పాఠశాలలు అన్నింటికీ సొంత భవనాలు..
  • ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు 1.10లక్షల మంది విద్యార్థులు..
  • ప్రభుత్వ స్కూళ్ల ఎదుట నో అడ్మిషన్ బోర్డులు…రెండేళ్ల కష్టం ఫలించింది..
  • చరిత్రలో తొలిసారి ప్రభుత్వ టెన్త్ ర్యాంకర్లతో యాడ్స్ ఇచ్చాం..
  • రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కలసికట్టుగా ముందుకు సాగుదాం..
  • రంపచోడవరం మెగా పేరెంట్-టీచర్ మీట్ లో విద్య శాఖ మంత్రి నారా లోకేష్..

ఎం. గణేశ్, జర్నలిస్టు  

వచ్చే ఏడాదిలోగా గిరిజన ప్రాంతాల్లో భవనాలు లేని ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించి, శిథిలావస్థలో ఉన్న భవనాలకు మరమ్మతులు చేపడతామని విద్య, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది సుమారు 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు.ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమష్టి కృషితో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం వస్తోందని, పలు పాఠశాలల్లో ప్రవేశాలు పూర్తయ్యే స్థాయికి చేరాయని అన్నారు.విద్యలో నాణ్యత పెంపునకు ఉపాధ్యాయ నియామకాలు, బదిలీల్లో పారదర్శకత, మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థి కిట్లు, సంచిలేని శనివారం, అభ్యాస ఫలితాలపై ప్రత్యేక దృష్టితో పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని వివరించారు.ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ‘తల్లికి వందనం’ పథకాన్ని కొనసాగిస్తున్నామని, మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.పిల్లలకు ఆస్తుల కంటే మంచి విద్య, విలువలు అందించడం ముఖ్యమని, విద్యే రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని లోకేష్ పేర్కొన్నారు.