స్థానిక ఎన్నికలపై జగన్ ఫోకస్..

స్థానిక ఎన్నికలపై జగన్ ఫోకస్..
పార్టీ నేతలకు కీలక ఆదేశాలు
ఎం. గణేశ్, జర్నలిస్టు
సాధారణంగా స్ధానిక ఎన్నికల్లో అధికార పార్టీకే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కొన్నిసందర్భాల్లో ప్రతిపక్ష్లానికి అభ్యర్ధులు కూడా దొరకని పరిస్ధితి ఉంటుంది. ఒకవేళ పోటీ చేసినా అధికార్టీ అభ్యర్ధులకు విజయం లభిస్తుంది. ఐదు సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న వైసీపీ ధాటికు తట్టుకోలేక టీడీపీ అభ్యర్ధులు పోటీ చేయడానికి ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు పరిస్ధితి ఇందుకు భిన్నంగా ఉంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనపడుతోంది. శాసన సభ్యుల అవినీతి, అధికారులు శాసన సభ్యుల చేతిలో కీలు బొమ్మలుగా మారిపోవడంతో ప్రజలకు అనేక సమస్యలు ఎదురౌవుతున్నాయి. దీనితో కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. అ పార్టీల సీనియర్ నాయకులు సైతం ప్రభుత్వ వైఖరి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్ధితులు నెలకొన్న పరిస్ధితిల్లో ప్రభుత్వం రానున్న ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో స్ధానిక ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పట్లు చేస్తుంది. ఈ పరిణామం వైసీపీకి అనుకూలంగానూ, కూటమికి వ్యతిరేకంగా కనపగడుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ అభ్యర్ధులు తప్పక విజయం సాధించేందుకు అనువుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 22న పార్టీ ముఖ్య నేతలు, ప్రాంతీయ సమన్వయకర్తలతో కీలక సమావేశం నిర్వహించి ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో సెప్టెంబర్ చివరి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముందుగా మున్సిపల్, అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశమున్న నేపథ్యంలో అన్ని పార్టీలు సన్నాహాలను వేగవంతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ వార్డు సభ్యుడి స్థాయి నుంచి మండల స్థాయి వరకు జరిగే ప్రతి ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తప్పనిసరిగా బరిలో ఉండాలని జగన్ స్పష్టం చేశారు. ఎక్కడైనా పార్టీ అభ్యర్థిని నిలబెట్టడంలో విఫలమైతే సంబంధిత నియోజకవర్గ ఇన్‌చార్జిని బాధ్యుడిగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు స్థానిక ఎన్నికల్లో అభ్యర్థిత్వాల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. అలాగే పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు స్థానిక ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. కూటమి పార్టీల వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో “జగన్ 2.0” యాప్‌ను పూర్తిస్థాయిలో వినియోగించి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని, ఎన్నికల్లో విజయం కోసం సమన్వయంతో పనిచేయాలని పార్టీ నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వారికి అవసరమైన సహకారం అందించాలని కూడా స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించే ఫలితాలను భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలో కీలక ప్రమాణంగా పరిగణిస్తామని జగన్ సంకేతాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో స్థానిక ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నెల 22న జరగనున్న సమావేశంలో ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపిక, పార్టీ సంస్థాగత బలోపేతంపై జగన్ మరింత స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.