విలువిద్య క్రీడాకారిణి జ్యోతిసురేఖ వెన్నంకు మంత్రిఅభినందనలు

విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నంకు మంత్రి అభినందనలు
అంతర్జాతీయ విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవల జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో సాధించిన పతకాల వివరాలను ఆమె మంత్రికి వివరించారు. జ్యోతి సురేఖ వెన్నం సాధించిన విజయాలను మంత్రి అభినందించారు.భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. క్రీడాకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.