
రీల్స్ చేసిన వారిపై కేసులు
తిరుమల, బెజవాడ ఎక్స్ ప్రెస్
తిరుమలలో కొంతమంది భక్తులు టీటీడీ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. శ్రీవారి ఆలయం ఎదుట రీల్స్, వీడియోలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. తాాజాగా కొందరు భక్తులు ఆలయం ముందు రీల్స్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే స్పందించిన టీటీడీ రీల్స్ చేసిన భక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. తిరుమల శ్రీవారి ఆలయం ముందు రీల్స్, వీడియోలను చిత్రీకరించకూడదని నిషేధం విధించింది. అంతేకాదు ఆలయం సమీపంలో మైకు ద్వారా భక్తులకు సూచనలు చేస్తున్నారు.. నిబంధనలకు విరుద్దుగా రీల్స్, వీడియోలు చిత్రీకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా సరే కొందరు మాత్రం టీటీడీ నిబంధనల్ని పట్టించుకోకుండా రీల్స్ చేస్తూనే ఉన్నారు.. తాజాగా కొంతమంది భక్తులు ఆలయం ముందు సినిమా పాటలకు రీల్స్ చేయగా వైరల్ అయ్యాయి. ఈ విషయం టీటీడీ దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయ్యింది.