Uncategorized

టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయశాఖ కార్యదర్శి కె. కన్నబాబు ప్రమాణ స్వీకారం

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · July 8, 2026 · 1 month క్రితం

టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయశాఖ కార్యదర్శి కె. కన్నబాబు ప్రమాణ స్వీకారం

ఎం.గణేశ్, జర్నలిస్టు .

తిరుమల తిరుపతి దేవస్థానాలు ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కె. కన్నబాబు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో కె. కన్నబాబుకు శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు భాస్కర్, ప్రశాంతి తదితర అధికారులు పాల్గొన్నారు.