Uncategorized

రహదారులు

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · September 28, 2026 · 4 days క్రితం

వాయుగుండంతో దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు రూ.1,498 కోట్లు

త్వరలో పనులు చేపడతాం: మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి

ఎం.గణేశ్, జర్నలిస్టు

తీవ్ర వాయుగుండం, భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రహదారుల పునరుద్ధరణకు రూ.1,498.30 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. ఇందులో తాత్కాలిక పునరుద్ధరణకు రూ.162.09 కోట్లు, శాశ్వత పనులకు రూ.1,336.83 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. మొత్తం 2,405 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతినగా, అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 412 కిలోమీటర్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. 36 ప్రాంతాల్లో రహదారులు కోతకు గురికాగా, 9 ప్రాంతాల్లో గండ్లు పడ్డాయని తెలిపారు. 187 ప్రాంతాల్లో చిన్న వంతెనలు, కల్వర్టులు దెబ్బతినగా 169 ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టామన్నారు. 254 ప్రాంతాల్లో పడిన చెట్లను తొలగించి, 103 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను పునరుద్ధరించినట్లు మంత్రి వెల్లడించారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు అందిస్తామని తెలిపారు.