ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్

24 గంటల్లో పసికందు కిడ్నాప్ కేసు ఛేదించిన బాపట్ల పోలీసులు

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · July 3, 2026 · 56 minutes క్రితం

బాపట్ల జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు నెలల పసికందు కిడ్నాప్ కేసును జిల్లా పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాలతో చీరాల డీఎస్పీ ఎం.డి. మోయిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏడు ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి పసికందును సురక్షితంగా తల్లి చెంతకు చేర్చాయి.

చీరాలలో తల్లిదండ్రులతో కలిసి ప్లాట్‌ఫారంపై నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు శిశువును అపహరించారు. పోలీసులు 360 CC Cams యాప్ సహా సీసీటీవీ ఫుటేజ్‌ను విశ్లేషించి నిందితుల వాహనాన్ని గుర్తించి నలుగురిని అరెస్ట్ చేశారు. సంతానం లేకపోవడంతో దంపతులు రూ. లక్షకు పసికందును కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి శిశువును రక్షించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.