ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్

విజయవాడ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక వైభవం

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · July 8, 2026 · 1 month క్రితం

ఎం.గణేశ్, జర్నలిస్టు .

విజయవాడ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక వైభవం

వార్షికోత్సవాల్లో మహాశాంతి హోమం, కలశాభిషేకం.. భక్తులతో కళకళలాడిన ఆలయం

విజయవాడలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు బుధవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైదిక సంప్రదాయాల ప్రకారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో రోజంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవాల ప్రారంభంలో వేద పండితులు మహాశాంతి హోమాన్ని నిర్వహించారు. వేదమంత్రాల నడుమ పూర్ణాహుతి సమర్పించగా, ఆలయ ప్రాంగణం భక్తిరసంతో నిండిపోయింది. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర కలశాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పవిత్ర తీర్థాలతో అభిషేకం అనంతరం విశేష అలంకారంలో అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని భక్తులు తిలకించి పరవశించారు. వార్షికోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి, మంగళహారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాలుకు చెందిన టెంపుల్ సూపరింటెండెంట్ ఎం. మల్లికార్జున, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ లలిత రమాదేవి, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు.