సింహాచలం స్వామివారి భూములపై ‘భూబకాసురుల’ కన్ను..!

- సింహాచలం స్వామివారి భూములపై ‘భూబకాసురుల‘ కన్ను..!
- అధికారుల అండదండలతో జోరుగా అక్రమ నిర్మాణాలు!
- దీనదయాలపురంలో సర్వే నెంబర్ 275 స్థలం కబ్జా..?
- తప్పుడు సర్వే నెంబర్లతో విక్రయాలు.. రాత్రికి రాత్రే వెలుస్తున్న కట్టడాలు
- ముడుపుల మత్తులో దేవాదాయ శాఖ అధికారులు?
- భక్తుల తీవ్ర ఆగ్రహం
ఎం. గణేశ్, జర్నలిస్టు
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి చెందిన భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ స్థానికులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం ఆస్తులను పరిరక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహం ప్రాంతంలో సర్వే నంబర్ 275లో ఉన్న దేవస్థానం భూమిని కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పుడు సర్వే నంబర్లతో పత్రాలు సృష్టించి ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు కొనసాగరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.నగరంలోని 13వ వార్డు పరిధిలోని దీనదయాలపురం ప్రాంతంలో సర్వే నంబర్ 275లో ఉన్న దేవస్థానం భూమిని కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పుడు సర్వే నంబర్లతో పత్రాలు సృష్టించి ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు కొనసాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.ఈ భూములను నకిలీ పత్రాల ఆధారంగా సామాన్య ప్రజలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాత్రి వేళల్లో నిర్మాణాలు వేగంగా చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు అడ్డుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. దేవస్థానం భూముల్లో బహిరంగంగా అక్రమాలు జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.దీనదయాలపురం ప్రాంతంలోని దేవస్థానం భూములపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను వెలికితీయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి, దేవస్థానం ఆస్తులను పరిరక్షించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.