టీడీపీ
టీటీడీ ఛైర్మన్ మార్పుపై చర్చ
ఎం.గణేశ్,జర్నలిస్టు
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవిలో మార్పుపై టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడుకు మరోసారి అవకాశం దక్కకపోవచ్చన్న ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో టీడీపీ సీనియర్ నేత, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.బీఆర్ నాయుడు పదవీకాలంలో పలు వివాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త వ్యక్తిని నియమించే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కళా వెంకటరావుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటం, ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత కావడంతో ఆయన పేరుపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే టీటీడీ ఛైర్మన్ మార్పు, కళా వెంకటరావు నియామకంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.