ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్

విజయవాడ ఉత్సవ్

బెజవాడ ఎక్స్‌ప్రెస్ బ్యూరో · September 28, 2026 · 4 days క్రితం

విజయవాడ ఉత్సవ్‌-2.0కు సర్వం సిద్ధం

అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు పది రోజుల పాటు వేడుకలు

ఎం.గణేశ్, జర్నలిస్టు

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు విజయవాడ ఉత్సవ్‌-2.0ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడ చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. ఉత్సవాల ద్వారా కళలు, పర్యాటక రంగాలకు ప్రోత్సాహం లభించడంతో పాటు ఆటో డ్రైవర్లు, చిరువ్యాపారులు, కళాకారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.

తోలుబొమ్మలాట, డప్పు, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలను పరిరక్షించడంతో పాటు పౌరాణిక పద్య నాటకాలకు వేదిక కల్పిస్తామన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్‌ ఆధ్వర్యంలో మాకినేని బసవపున్నయ్య స్టేడియం, పున్నమి ఘాట్‌, సిద్ధార్థ సైన్స్‌ కళాశాల ప్రాంగణాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దసరాకు విజయవాడను ప్రముఖ ఉత్సవ వేదికగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.