సాగర్

ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రభుత్వ భరోసా
ఎం.గణేశ్, జర్నలిస్టు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డుల ద్వారా మెరుగైన నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఏపీ ఎన్‌జీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ స్వాగతించారు. ఈహెచ్‌ఎస్ కింద ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి వచ్చే కంట్రిబ్యూషన్‌తో పాటు ప్రభుత్వం అందించే మ్యాచింగ్ గ్రాంట్‌తో నెలకు సుమారు రూ.34 కోట్లు సమకూరుతున్నాయని తెలిపారు. ఈ నిధులను ప్రతి నెలా సకాలంలో డా. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్–ఈహెచ్‌ఎస్ ఖాతాకు జమ చేయడం వల్ల ఆసుపత్రుల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం తగ్గి, నగదు రహిత వైద్య సేవలు మరింత సజావుగా అందే అవకాశం ఉందన్నారు. హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారానికి ఎన్‌జీజీవోస్ చేసిన కృషికి ఇది ఫలితమని పేర్కొన్నారు.